1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Amazing health benefits for gas trouble

పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఇలా చేస్తే..?

gas trouble
చిన్నారుల నుండి పెద్దవారి వరకు ఎవరికైనా సరే.. గ్యాస్ ట్రబుల్ సమ్యస వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ కారణంగా కడుపు ఉబ్బరం, ఛాతినొప్పి, గ్యాస్ వస్తుండడం తదితర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. గ్యాస్ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉండాయి. మలబద్దకం, ప్రేగుల్లో సమస్య, మధుమేహం, అల్సర్లు వంటి అనేక కారణాల వలన గ్యాస్ సమస్య వస్తుంది. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ కింద తెలిపిన ఇంటి చిట్కాలు పాటిస్తే చాలా సులభంగా బయటపడవచ్చు.. 
 
1. ఓ పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. నీరు బాగా మరిగిన తరువాత వడగట్టి అందులో స్పూన్ తేనె కలిపి వేడిగా ఉండగానే తాగితే గ్యాస్ సమస్య తగ్గుతుంది.
 
2. భోజనం చేసిన తరువాత 2 స్పూన్ల వాములో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది. వాములోని యాంటీ ఆక్సిడెంట్స్, విటిమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యాన్ని రెట్టింపు చేయడంలో ఎంతో దోహదపడుతాయి. 
 
3. గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, స్పూన్ తేనె కలిపి తాగితే గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు. అలానే గోరువెచ్చని నీటిలో స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ కలిపి తాగినా గ్యాస్ తగ్గుతుంది.
 
4. పాత్రలో నీరు తీసుకుని అందులో జీలకర్ర లేదా వాము 4 స్పూన్స్ వేసి బాగా మరిగించాలి. అనంతరం నీటిని వడగట్టి వేడిగా ఉండగానే తాగేయాలి. దీంతో గ్యాస్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
తర్వాతి కథనం
టెస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై..?