1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. kapha tatwam personalities as per ayurveda

తడి కళ్లు, అతి బరువుతో ఎగురుతున్నట్లుండే నడక... ఇలాంటివారు...

kapha tatwam personalities
ఆయుర్వేదం ప్రకారం కఫతత్వ ముఖ్యలక్షణం ప్రశాంతత. శరీరంలో ప్రధానమైన నిర్మాణసూత్రం అయిన కఫ దోషం నెమ్మది, నిలకడను కలుగజేస్తుంది. బరువు, భారీ శరీరంలో ఇది భౌతిక శక్తి, దమ్ము ఒనరుల్ని ఏర్పరుస్తుంది.


ఇలాంటివారు ఖచ్చితంగా ఆరోగ్యకరంగా వుంటారు. కాబట్టి కఫతత్వం కలిగినవారిని ఆయుర్వేదంలో అదృష్టవంతులు అంటారు. వీరు ప్రపంచాన్ని నిర్మలంగా చూస్తారు. ఇతరులను కష్టపెట్టే స్వభావం తక్కువు. అంతా సుఖంగా వుండాలని కోరుకుంటారు.

 
నిర్ణయం తీసుకోవడంలో మల్లగుల్లాలు పడి చాలా సమయం తీసుకుంటారు.
నిదానంగా మేల్కొంటారు. చాలాసేపు అలాగే పడుకుని వుండి లేవగానే కాఫీ తాగుతారు. 
ఉన్న స్థితితో సంతోషంగా వుండి, ఇతరుల పట్ల స్నేహభావం కలిగి వుంటారు.
తినే తిండి విషయంలో మానసిక సౌఖ్యాన్ని కోరుకుంటారు.
చక్కటి ప్రవర్తన, తడి కళ్లు, అతి బరువు వున్నప్పటికీ ఎగురుతున్నట్లుండే నడక వీరి సొంతం.
దృఢంగా, బలంగా వుండే దేహనిర్మాణంతో వుంటారు.
ప్రశాంతత, విశ్రాంతి నిండిన వ్యక్తిత్వం, కోపం తేలికగా రాని గుణంతో వుంటారు.
చల్లగా, నునుపుగా, గట్టిగానూ పాలిపోయినట్లుండే జిడ్డు చర్మాన్ని కలిగి వుంటారు.
కొత్త విషయాలు గ్రహించడంలో ఆలస్యం అయినా బలమైన జ్ఞాపకశక్తి కలిగి వుంటారు.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
భారతదేశంలోని సగం మంది సరిగా నిద్రపోలేకపోతున్నారు, ఎందుకు?