గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (22:40 IST)

తిప్పతీగతో మధుమేహం, ఒబిసిటీ పరార్

డయాబెటిస్ వున్నవారికి తిప్పతీగ భేష్‌గా పనిచేస్తుంది. షుగర్ ఉన్నవారు అర టీస్పూన్ తిప్పతీగ రసాన్ని రోజూ ఉదయం, సాయంత్రం భోజనం అనంతరం తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గడమే కాదు.. రోగ నిరోధక శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది. 
 
అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నవారు. ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో 2 టీస్పూన్ల తిప్పతీగ రసాన్ని బాగా కలిపి తాగాలి. అయితే మోతాదుకు మించరాదు.
 
ఆయుర్వేద నిపుణుల సూచనల మేరకు ఈ తిప్ప తీగ చూర్ణాన్ని వాడటం మంచిది. రాత్రి భోజనం అనంతరం పావు టీస్పూన్ తిప్ప తీగ చూర్ణానికి 1 టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇంతకు మించి మోతాదులో చూర్ణాన్ని తీసుకోరాదు.