1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Health Benefits of Dragon Fruit

డ్రాగన్ ఫ్రూట్‌‌కి అంత శక్తి వుందా? వాటన్నింటిని అడ్డుకుంటుందా?

Health Benefits of Dragon Fruit
డ్రాగన్ ఫ్రూట్‌. ఈ పండులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు వుండటం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తెల్ల రక్త కణాలను దెబ్బతినకుండా రక్షించడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్త కణాలు హానికరమైన పదార్థాలపై దాడి చేసి నాశనం చేస్తాయి.

 
గుండెకు మేలు చేస్తుంది
ఎరుపు రంగు పల్ప్‌తో కూడిన డ్రాగన్ ఫ్రూట్‌లో బీటాలైన్స్ చెడు కొలెస్ట్రాల్(LDL కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది. పండ్ల లోపల ఉండే చిన్న ముదురు నలుపు గింజలలో ఒమేగా-3, ఒమేగా-9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

 
మూత్రపిండాల పనితీరుకు సహకరిస్తుంది
భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడానికి, రక్తంలో విషాన్ని తటస్థం చేయడానికి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇండోనేషియా అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ బ్యాలెన్సింగ్, మూత్రపిండాలు, ఎముకల పనితీరును బలోపేతం చేస్తుంది. మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
తాజా ద్రాక్ష పండు వర్సెస్ ద్రాక్ష రసం