శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 మార్చి 2022 (22:47 IST)

ఆ సమయంలో స్త్రీలు తులసి తీసుకుంటే గర్భాశయ సంకోచానికి కారణమవుతుంది

రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు శ్వాస సంబంధ సమస్యలను సమర్థవంతంగా అడ్డుకోగలదు తులసి. కానీ మంచిదే కదా అని మరీ ఎక్కువగా తింటే మాత్రం అసలుకే మోసం వస్తుంది. ముఖ్యంగా మహిళలు గర్భధారణ సమయంలో తులసి తినడం వల్ల దుష్ప్రభావాలు వుంటాయని వైద్యులు చెపుతారు.

 
తులసిలో హైపోగ్లైకేమిక్ పదార్థాలుంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల, గర్భధారణ సమయంలో తులసి అధికంగా తీసుకోవడం వల్ల మైకము, కోపం మరియు చిరాకు వస్తుంది. తులసి గర్భాశయ సంకోచానికి కారణమవుతుందని అంటారు. గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు తులసి తినకూడదని వైద్యులు సలహా ఇవ్వడానికి ఇదే కారణం.

 
తులసిలో యూజీనాల్ అనే నూనె ఉంటుంది. ఇది అధికంగా తినేటప్పుడు హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది. ఇది గుండె కొట్టుకోవడాన్ని వేగవంతం చేస్తుంది. నోటిలోనూ గొంతులో మంటను కలిగిస్తుంది. శ్వాసను నిస్సారం చేస్తుంది. ఈ నూనె మైకము, మూర్ఛలు, మూత్రవిసర్జన సమయంలో రక్తస్రావం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కనుక తులసిని కొంతమేరకు మాత్రమే ఉపయోగించాలి.