ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (23:14 IST)

తులసి వేరును, శొంఠిని సమభాగాలుగా తీసుకుని...

తులసి వేరును, శొంఠిని సమభాగాలుగా తీసుకుని ఈ రెండింటినీ మెత్తగా నూరి.. కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారుచేసుకోవాలి. వీటిని ప్రతిరోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరువెచ్చని నీటితో సేవిస్తే.. చర్మ వ్యాధులు, దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. 

 
తులసి ఆకులు, వెల్లుల్లిని నూరి.. వాటి రసాన్ని చెవిలో వేసుకుంటే.. చెవినొప్పి తగ్గుతుంది. కఫ వ్యాధులతో బాధపడేవారు.. కొన్ని తులసి ఆకులను నీటిలో మరిగించుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కలిపి రోజూ తాగుతుంటే.. కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.

 
ప్రతిరోజూ నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగితే మానసకి ఆందోళనలు, ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుందని ఇటీవలే ఓ పరిశోధనలో స్పష్టం చేశారు. స్పూన్ తులసి గింజలను కప్పు నీటిలో వేసి కాసేపు అలానే ఉంచి ఆ తరువాత తాగితే.. మూత్రం సాఫీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గుతాయి.