బుధవారం, 11 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 17 ఫిబ్రవరి 2022 (19:38 IST)

చెడు కొవ్వును అడ్డుకోగల మామిడి ఆకులు... ఇంకా..

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తమ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అరటి సంబంధిత పదార్థాలు తినాలి. ఇవి చాలా పోషకాలను కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని చాలా సులభంగా పెంచుతుంది.


కిడ్నీ స్టోన్‌ అడ్డుకుని ఆరోగ్యంగా వుండాలంటే మామిడి ఆకులను తినాలి. అవి కిడ్నీలోని రాళ్లను విచ్ఛిన్నం చేయడానికి, మూత్రం ద్వారా తొలగించడానికి సహాయపడతుందని భావిస్తారు. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది.

 
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మామిడి ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మామిడి ఆకులు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అదనంగా, ఈ ఆకులు బీపీని కూడా నియంత్రిస్తాయి. ఈ విధంగా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.