బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 మార్చి 2022 (23:22 IST)

నరాల బలహీనతలను తగ్గించే బొప్పాయి, ఇంకా...

బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది.

 
అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏవిధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది. బొప్పాయిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతో పాటు ఖనిజాలు, ప్లేవనాయిడ్స్ వంటి మరెన్నో పోషకాలు ఉంటాయి. 

 
కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది నరాల బలహీనతలను తగ్గించే మంచి టానిక్ కూడా. క్యాల్షియం, పాస్ఫరస్ ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, గంధకం, క్లోరిన్ వంటి పోషకాలు తగు మోతాదులో ఉండటం వల్ల బొప్పాయి పలు శారీరక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలుగుతుంది. కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఎ, ఇలు కూడా బొప్పాయిలో ఉంటాయి.