గురువారం, 7 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (13:17 IST)

బొప్పాయిలో పోషకాలెన్నో.. జ్ఞాపకశక్తికి ఎంతో మేలు

మీకు విటమిన్ ఎ లోపం ఉంటే, మీరు ఖచ్చితంగా బొప్పాయి తినాలి. ఎందుకంటే బొప్పాయిలో విటమిన్ ఎ, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి పండులో విటమిన్ బి, విటమిన్ బి-6, రిబోఫ్లేవిన్ ఉంటాయి.
 
బొప్పాయి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో పీచుపదార్థాలతో పాటు పపైన్ అనే జీర్ణ ఎంజైమ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బొప్పాయి పండు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే బొప్పాయిని జోడించండి. ఇది జీర్ణక్రియకు సహాయపడటం వలన బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
 
మొటిమలతో బాధపడేవారు తరిగిన బొప్పాయి ముక్కలను ముఖంపై మెత్తగా రుద్దండి. మొటిమలను పోగొట్టి, ముడతలను పోగొట్టి, తేజస్సును చేకూర్చే బొప్పాయి ఇది. దంత సమస్యలు, మూత్రాశయంలోని రాళ్లను నయం కరిగించడానికి బొప్పాయి సరిపోతుంది. బొప్పాయిని తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.