గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 10 అక్టోబరు 2021 (14:12 IST)

డెంగ్యూను అడ్డుకునే బొప్పాయి ఆకుల రసం

బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి కాయ, బొప్పాయి రసంతో డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చు. బొప్పాయి కాయ మనిషికి ప్రకృతి అందించిన కానుక. దాన్ని వీలైనపుడల్లా తింటూ ఉండడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. బొప్పాయిని తరచూ తిన్నవారికి రాళ్లు తిన్నా జీర్ణమవుతాయి. త్వరగా వయసు మీద పడదు. చర్మం ముడతలు పడడాన్ని నివారిస్తుంది.
 
శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. పుంసత్వానికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, అతి వేగంగా తగ్గిపోతాయి. ఆటలకు, ఆటల పోటీలకు వెళ్లే ముందు బొప్పాయి ముక్కలు తినివెడితే, శరీరంలో చివరి క్షణం వరకూ శక్తి, సత్తువ ఉంటాయి. ఇక ఇది శరీరానికి అవసరమైన సి, ఇ విటమిన్లను అందజేస్తుంది. ఫలితంగా శరీరానికి కేన్సర్ సోకదు. కేన్సర్ కణాలను పెరగనివ్వదు.
 
ఒంట్లో నొప్పులు, గాయాలు, రక్తస్రావాలు, బొబ్బలు, పుళ్లు, కీళ్లనొప్పులు వగైరాలు తగ్గాలన్నా వ్యాధుల నుంచి వేగంగా కోలుకోవాలన్నా బొప్పాయి ముక్కలే సరైన మందు. రక్తాన్ని, చర్మాన్ని, దంతాలను, జీర్ణకోశాన్ని, ఊపిరితీత్తుల్ని, గుండెను క్షణాల్లో శుభ్రం చేస్తుంది. బొప్పాయిలోని పీచు పదార్థం కొలెస్టరాల్‌ని అతి త్వరగా కరిగిస్తుంది. గుండె జబ్బుల్ని దగ్గరికి రానివ్వదు. ఉదయమే తింటే శరీరానికి మంచిది.