1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 డిశెంబరు 2021 (23:32 IST)

ఈ ఆకుకి ఆమోఘమైన శక్తి, ప్రయోజనాలు ఇవే...

ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘం. ఇది వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగలదు. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు రాకుండా, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తిప్పతీగతో తయారుచేసిన మందులను వాడకూడదు.

 
తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. అలాగే శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి తిప్పతీగకు ఉంటుంది. కాస్త తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే చాలు... అజీర్తి సమస్య పోతుంది. 

 
తిప్పతీగ హైపోగ్లైకేమిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలదు. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి తిప్పతీగ మందులు బాగా పని చేస్తాయి. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.

 
ఆర్థరైటిస్‌తో బాధపడేవారు తిప్పతీగను ఉపయోగిస్తే చాలా మంచిది. కీళ్లవ్యాధులను తగ్గించే గుణాలు తిప్పతీగలో చాలా ఉన్నాయి. తిప్పతీగ పొడిని కాస్త వేడి పాలలో కలుపుకుని తాగితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యల బారి నుంచి బయటపడొచ్చు. ఆ పాలలో కాస్త అల్లం కలుపుకుని కూడా తాగొచ్చు.