శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 3 డిశెంబరు 2021 (23:38 IST)

చలికాలంలో గొంతునొప్పి, తగ్గేందుకు 5 చిట్కాలు

చలికాలంలో ఇబ్బంది పెట్టే సమస్య గొంతు నొప్పి. ఇది గొంతులో ఇన్‌ఫెక్ష‌న్‌ కారక సూక్ష్మక్రిములు చేరడం వల్ల గొంతునొప్పిమొదలవుతుంది. ఆ తర్వాత వాయిస్ సరిగ్గా రాకపోవడం, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని పాటి ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిళించాలి. ఇలా చేస్తే గొంతునొప్పి మటుమాయం.
 
2. అల్లం టీ గొంతు నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు గొంతు ఇన్ఫెక్షన్‌ను కూడా నివారిస్తుంది.
 
3. మిరియాలతో పాలు తాగినా కూడా గొంతు నొప్పి తగ్గుతుంది.
 
4. గొంతు నొప్పితో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే నొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది.
 
5. తేనె- నిమ్మరసం గోరువేచ్చని నీటిలో కలిపి తాగితే మంచి  ఫలితాన్నిస్తుంది. గొంతునొప్పి ఉండే సమయంలో చల్లని నీరు, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.