ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (16:18 IST)

అఖిలపక్ష సమావేశం ప్రారంభం - హాజరైన విపక్ష నేతలు

దేశ పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఆదివారం అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో పార్లమెంట్ ఆవరణలో ఈ సమావేశం ప్రారంభమైంది. 
 
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, పియూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘావాల్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, ఆనంద్ శర్మ, తెరాస తరపున నామా నాగేశ్వర రావు, వైకాపా తరపున విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 
 
పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా కేంద్రం ఈ భేటీని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా అన్ని పార్టీల నేతలతో కేంద్రం చర్చించనుంది. కాగా, ఈ సమావేశాలు నెల రోజుల పాటు సాగనున్నాయి.