ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 3 ఫిబ్రవరి 2022 (17:59 IST)

బాదములతో మీ కుటుంబ ఆరోగ్యం: ఆయుర్వేద మరియు న్యూట్రిషనల్‌ సైన్స్‌ నుంచి అభ్యసించండి

ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నేడు వర్ట్యువల్‌ చర్చా కార్యక్రమాన్ని ‘ఆయుర్వేద మరియు న్యూట్రిషనల్‌ సైన్స్‌తో సంపూర్ణమైన ఆరోగ్యం సాధించడం’ అనే అంశంపై నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ నటి నిశా గణేష్‌ , న్యూట్రిషనిస్ట్‌ మరియు వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మరియు ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌ విశాఖ మహింద్రూ పాల్గొన్నారు. ఈ ప్యానెల్‌కు మోడరేటర్‌గా ఆర్‌జె శృతి వ్యవహరించారు.

 
ఈ చర్చ ద్వారా ప్యానలిస్ట్‌లు కుటుంబంలోని ప్రతి వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ప్రసాదించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పడంతో పాటుగా దానినే తమ తొలి మరియు అత్యున్నత ప్రాధాన్యతగా చేసుకోవాలని వెల్లడించారు. దీనిలో భాగంగా , ప్యానలిస్ట్‌లు విస్తృతంగా డైట్‌, న్యూట్రిషన్‌, సరిగా తినడం వంటి అంశాలను గురించి సమగ్రంగా వెల్లడించడంతో పాటుగా ఆయుర్వేద, న్యూట్రిషనల్‌ సైన్స్‌ సహా భారతదేశంలో అందుబాటులో ఉన్న పలు ఆరోగ్య ప్రక్రియల గురించి కూడా చర్చించారు.
 
ఈ చర్చా కార్యక్రమంలోనే భారతదేశంలో ఆరోగ్య పరంగా ఉన్న పలు నమ్మకాలు గురించి కూడా చర్చించారు. అలాగే ఆ నమ్మకాల చుట్టూ ఉన్న ఆహారపు అలవాట్లు, చాలా వరకూ కేసులలో ఆ నమ్మకాలు ఏ విధంగా తరతరాలుగా వెళ్తున్నది కూడా  చర్చించారు.  ఈ చర్చా కార్యక్రమంలో , ఉదాహరణకు, బాదములను నానబెట్టి, పైన పొట్టు తీసి తినడం, వాటిని పిల్లలకు అందించడం, ఇంట్లోని విద్యార్ధులు, పెద్దలకు అందించడం గురించి చర్చించారు. బాదములతో తెలివితేటలు పెరుగుతాయని, అలాగే మొత్తంమ్మీద కుటుంబ సభ్యులలో పౌష్టికాహారం తీసుకోవడమూ మెరుగుపడుతుందని నమ్ముతున్నారు.

 
గత కొద్ది దశాబ్దాలుగా భారతీయ జీవన విధానంలో వస్తున్న మార్పులు, మరీ ముఖ్యంగా విదేశీ ఆహారం, క్యుసిన్‌ల ప్రభావం ఇక్కడి ప్రజల ఆహార అలవాట్లను ప్రభావితం చేస్తున్న తీరు, అవి మన కిచెన్‌లను ఆక్రమిస్తున్న వైనంను  సైతం చర్చా కార్యక్రమంలో ప్యానలిస్ట్‌లు చర్చించారు. ఈ ప్రాసెస్డ్‌, అధిక కేలరీలు కలిగిన ఆహారం, స్నాక్స్‌ను తరచుగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలను గురించి ప్యానలిస్ట్‌లు వెల్లడించడంతో పాటుగా సహజసిద్ధమైన మరియు సంప్రదాయరుచులను అందించే ఆహారాలైనటువంటి బాదములు, మిల్లెట్లు, తోటకూర, జొన్నలు, ఎర్ర బియ్యం వంటి వాటిని తీసుకోవడంతో కలిగే ప్రయోజనాలను చర్చించారు.

 
మన ఆయుర్వేద, న్యూట్రిషనల్‌ సైన్స్‌ నుంచి పొందిన విజ్ఞానంతో ఏ విధంగా తినాలనే అంశాలను ప్యానలిస్ట్‌లు చర్చించడంతో పాటుగా ఆహారాన్ని  ఏ విధంగా తీసుకోవాలనేది కూడా  చర్చించారు. ఆయుర్వేద, న్యూట్రిషనల్‌ సైన్స్‌ నుంచి తెలుసుకున్న అంశాలను మెరుగైన ఆరోగ్యం పొందడంలో ఏ విధంగా ఏ వినియోగించవచ్చో కూడా తెలిపారు. దీనిలో భాగంగా ప్యానలిస్ట్‌లు క్రమం తప్పకుండా బాదములను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను సైతం చర్చించారు. భారతీయ సంస్కృతిలో బాదముల వినియోగం ఓ భాగమంటూ, కుటుంబ నమ్మకాలతో పాటుగా ఆయుర్వేద రచనలు, న్యూట్రిషనల్‌ సైన్స్‌లోనూ వీటి ప్రాముఖ్యత వెల్లడించడం జరిగిందన్నారు.

 
ఆయుర్వేదలో చెప్పిన దాని ప్రకారం, బాదములను వటడ లేదా బాద్మ లేదా వట్మ అని చెప్పడం  జరిగింది. దీనిని మధుర లేదా తీపి ఆహారంగా చెప్పడంతో పాటుగా స్నిగ్ధ లేదా మృదుల లక్షణాలు కలిగి ఉందని వెల్లడించడం జరిగింది.  దోషాలపై (దోష కర్మ)దీని  ప్రభావం గురించి చెబుతూ  ఇవి వాత-పిత్తహారగా పేర్కొనడం జరిగింది. ఇవి వట మరియు పిత్త దోషాలను నివారించడంతో పాటుగా కఫాకరగా ఉంటాయని, ఇవి కఫ దోషం కూడా పెంచుతాయని, దోష లక్షణాలు పెరిగిన ఎడల తగిన రీతిలో వీటిని వినియోగించడం జరుగుతుందని వెల్లడించారు.

 
న్యూట్రిషనల్‌ సైన్స్‌ చూస్తే, బాదములు పౌష్టికాహార స్నాకింగ్‌ అవకాశంగా ఉండటంతో పాటుగా సంవత్సరాల తరబడి చేస్తున్న పరిశోధనలు సైతం వెల్లడించే దాని ప్రకారం వీటిని క్రమం తప్పకుండా తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడటం, మధుమేహం, బరువు నియంత్రణ, చర్మ ఆరోగ్యం మెరుగుపడటం వంటి ప్రయోజనాలు సైతం కలుగుతాయని వెల్లడిస్తున్నాయి.

 
సుప్రసిద్ధ భారతీయ టెలివిజన్‌ మరియు చిత్ర నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ, ‘‘ఓ తల్లిగా,భార్యగా, కోడలిగా, కూతురు లేదంటే సోదరిగా నేను నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో పాత్రలను పోషించాను. నాకెప్పుడూ కూడా నా కుటుంబ ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యతాంశం. వారి సంక్షేమం కోసం, భారతదేశంలో ఎంతోమంది మాతృమూర్తుల్లాగానే, నేను  కూడా నాదైన వ్యవస్థను సృష్టించుకున్నాను. ఎన్నో తరాల మా కుటుంబ ఆచారాలు, ఆయుర్వేద, ఆధునిక న్యూట్రిషనల్‌ సైన్స్‌ నుంచి తెలుసుకున్న అంశాల నుంచి వీటిని రూపొందించుకున్నాను. కానీ, నా వంటగదిలో ఎప్పుడూ స్థానం కలిగి ఉన్నవి మాత్రం బాదములు. నా చిన్నతనం నుంచి కూడా బాదముల వల్ల కలిగే ప్రయోజనాలను వింటూనే ఉన్నాను.

 
నా కుటుంబం మొత్తం ప్రతి రోజూ ఖచ్చితంగా బాదములు తినేలా తగిన చర్యలు తీసుకుంటుంటాను. ఇది నాతో పాటుగా నా కుటుంబ సభ్యుల రోగ నిరోధక శక్తి మెరుగుపడటంలో తోడ్పడుతుంది. బాదములలో రాగి, జింక్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ సైతం ఉన్నాయి. ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందడం, నిర్వహించడం,ఆ రోగ నిరోధక శక్తి తగిన రీతిలో పనిచేయడానికి తోడ్పడుతుంది. దీనితో పాటుగా ఆయుర్వేద వెల్లడించిన దాని ప్రకారం, బాదములను తరచుగా తినడం వల్ల మెదడుకు సైతం తగిన పోషణ లభిస్తుంది. నెర్వ్‌ టిష్యూలకు సైతం తగిన పోషణ లభిస్తుంది. చిన్నారులకు చక్కటి స్నాక్‌గా సైతం నిలుస్తుంది’’ అని అన్నారు.

 
ఆయుర్వేద నిపుణులు డాక్టర్‌ విశాఖ మహింద్రూ మాట్లాడుతూ, ‘‘ఆయుర్వేద విజ్ఞానాన్ని నేటి తరపు ఆధునిక న్యూట్రిషనల్‌ సైన్స్‌తో మిళితం చేసి తగిన రీతిలో వినియోగించాల్సిన ఆవశ్యకత నేటి తరానికి ఉందని నేను భావిస్తున్నాను. తమ డైట్‌లో  సహజసిద్ధమైన ఆహారంను, ఆరోగ్యవంతమైన జీవనశైలిని భాగం చేసుకోవాలి. ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములను తినడం ద్వారా ఈ మార్పును స్వీకరించడం వీలు కావడమే కాదు దీర్ఘకాలంలో మార్పునూ చూడవచ్చు. వేలాది సంవత్సరాలుగా బాదములను ఆరోగ్యానికి ఉపయుక్తమైన గింజలుగా భావిస్తున్నారు.

 
భారతీయులుగా మనమంతా కూడా వాటి వైవిధ్యమైన ప్రయోజనాల పై ఆధారపడుతూనే ఉంటాం. ఆయుర్వేద నుంచి మనకు ఈ నమ్మకాలు ఎంతో కాలంగా ఉంటూనే ఉన్నాయి. ప్రతి రోజూ బాదములను తినడం వల్ల మజిల్‌ స్ట్రెంగ్త్‌ వృద్ధి చెందడంతో పాటుగా శరీరం కూడా శక్తివంతమవుతుంది. నరాల వ్యవస్థను ఇది బలోపేతం చేయడంతో పాటుగా వ్యక్తి యొక్క మేని ఛాయను సైతం మెరుగుపరిచి, వారి చర్మమూ రక్షిస్తుంది’’ అని అన్నారు.

 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘ ప్రతి ఒక్కరికీ చక్కటి ఆరోగ్యం నిర్వహించడమనేది ప్రాధాన్యతాంశంగా ఉండాలి. దీనిని చక్కటి ఆహార అలవాట్లు మరియు సహజసిద్ధమైన మరియు పౌష్టికాహార ఆహారమైనటువంటి బాదములు వంటి వాటిని భాగంగా చేసుకోవడం ద్వారా సాధించవచ్చు. ఆరోగ్యవంతమైనది తినడం వల్ల కేవలం భావోద్వేగాలు మారడం మాత్రమే కాదు ఓ వ్యక్తి బరువు కూడా నిర్వహించడం సాధ్యమవుతుంది. దీనితో పాటుగా దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులు అయినటువంటి టైప్‌ 2 మధుమేహం లేదా కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు (సీవీడీ) సైతం నిర్వహించవచ్చు.

 
బాదములు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తాయి. ఎందుకంటే  ప్రతి ఒక్కరూ తినేందుకు అనుకూలమైన ఆహారం అది. కుటుంబ సభ్యులు వాటిని నీళ్లలో నానబెట్టి ఉదయమే ఓ గుప్పెడు బాదములు తినవచ్చు. లేదంటే  చిన్న చిన్న మొత్తాలలో వాటిని  రోజంతా తినవచ్చు లేదంటే విభిన్నమైన రెసిపీలను తయారుచేసి భారతీయ రుచులతో జోడించవచ్చు. బ్లడ్‌ షుగర్‌ పట్ల ఆందోళన కలిగిన వారు బాదములను రెగ్యులర్‌గా తినవచ్చు. పరిశోధనలు సూచించే దాని ప్రకారం ప్రతి రోజూ బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్ధాయిలను నిర్వహించవచ్చు. అలాగే టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు తమ కార్డియోవాస్క్యులర్‌ మార్కర్స్‌ సైతం వృద్ధి చేసుకోవచ్చు’’ అని అన్నారు

 
ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో కుటుంబాలు మెరుగైన ఆరోగ్యాన్ని నిర్వహించడం వీలవుతుంది. తేలికగా జీర్ణం కావడంతో పాటుగా శక్తివంతంగా మరియు మానసిక స్థితిని పెంచడమే కాకుండా భారతదేశంలో వృద్ధి చెందుతున్న దీర్ఘకాలిక, జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది తోడ్పడుతుంది. ఆహారంలో కొద్దిపాటి మార్పులు మరియు జీవనశైలి మార్పులు అయినటువంటి పౌష్టికాహార మరియు సహజసిద్ధమైన ఆహారాలైనటువంటి ప్రతిరోజూ బాదములను తీసుకోవడం ద్వారా భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన మార్పును తమ జీవితాలకు తీసుకురాగలరు.