బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 6 జనవరి 2022 (22:56 IST)

బాదములలో పోషకాలు ఎంత?

బాదములు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మూడింట రెండొంతుల మంది బాదములను ఆరోగ్యవంతమైన స్సాకింగ్‌ అవకాశంగా భావిస్తున్నారు. రోగ నిరోధక శక్తి మెరుగుపడటంలో బాదములు తోడ్పడతాయని 84% మంది భావిస్తున్నారు.

 
బాదములలో పోషకాలు (41%), ఆరోగ్యం (39%), ప్రోటీన్‌ అధికంగా ఉండటం(38%) విటమిన్‌లు అధికంగా ఉండటం (36%) కారణంగా ఎంచుకుంటున్నామంటున్నారు. 9%మంది బాదములు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.

 
దాదాపు 50% మంది స్పందనదారులు తాము ఆకు కూరలు, కూరగాయలు, తాజా పండ్లు , జ్యూస్‌లను సైతం తమ స్నాకింగ్‌ ప్రక్రియలో భాగం చేసుకున్నాంటున్నారు. దాదాపు 66% మంది యువత తమ పోషక అవసరాల పట్ల బాధపడుతున్నారు. బరువు పెరగడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఈ ఆందోళనలకు కారణంగా నిలుస్తుంది.

 
ఉత్తరాదిలో ప్రతి నలుగురులో ముగ్గరు  తమ పోషకాహార అవసరాల పట్ల ఆందోళన చెందుతున్నారు. 51% మంది తాము స్నాక్స్‌ కొనుగోలు చేసేటప్పుడు పోషక విలువలు, పదార్థాలకు అమిత ప్రాధాన్యతనిస్తామంటున్నారు. ఈ తరహా సమాధానాన్ని 26-35 సంవత్సరాల మహిళల నోట ఎక్కువగా వింటే,అనంతరం 18-25 సంవత్సరాల వయసు వారు  ఉంటున్నారు.

 
61% మంది ఇంటి వంటకే అధిక ప్రాధాన్యతనందిస్తున్నారు. దాదాపు 50% మంది రోజుకోమారు స్నాక్స్‌ తీసుకుంటామంటుంటే, 41% మంది రెండు సార్లు తాము రోజూ స్నాక్‌ తీసుకుంటామంటున్నారు. స్నాకింగ్‌ ఫ్రీక్వెన్సీ 18-25 సంవత్సరాల వయసువారిలో అధికంగా ఉంది.

 
కోవిడ్‌ ముందుకాలంతో పోలిస్తే కోవిడ్‌ కాలంలో తమ స్నాకింగ్‌ ఫ్రీక్వెన్సీ పెరిగిందని నాలుగోవంతు మంది అంటుంటే ప్రతి ముగ్గురు స్పందన దారులలో ఒకరు తినడానికి కూడా సమయం లేక భోజనం బదులు స్నాక్స్‌ తింటున్నామంటున్నారు.