శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (19:46 IST)

అలా చేస్తే శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మాయం...

ఆరోగ్యంగా వుండేందుకు పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాల వల్ల ఒక్కో ధాతువులో ఒక్కో రకం దోషం పెరుగుతుంది. ఈ స్థితిలో శరీరాన్ని విషతుల్యం చేసే ఆ కారణాలను తొలగించడమే నిజమైన చికిత్స అవుతు

ఆరోగ్యంగా వుండేందుకు పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఎందుకంటే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాల వల్ల ఒక్కో ధాతువులో ఒక్కో రకం దోషం పెరుగుతుంది. ఈ స్థితిలో శరీరాన్ని విషతుల్యం చేసే ఆ కారణాలను  తొలగించడమే నిజమైన చికిత్స అవుతుంది. 
 
అందుకు శరీరాన్ని శుద్ధి చేసే శోధన చికిత్సలు చేయాలి. దీనికి ఐదు రకాల ప్రక్రియలతో వుండే పంచకర్మ చికిత్స ఉత్తమ మార్గం. అవసరాన్ని బట్టి పంచకర్మల్లోని ఐదు చికిత్సల్లో ఏదో ఒకటిగానీ, అన్నీగానీ చేయాలి. వీటికితోడు జల మర్దనం, స్నేహనం అంటే శరీరానికి నూనె పట్టించడం, స్వేదనం అంటే ఆవిరి స్నానం కూడా అవసరమే. 
 
అలాగే ప్రత్యేకమైన కొన్ని రకాల ఆహార పదార్థాలతో శరీరంలో మూతపడిన శ్రోతస్సులన్నీ తెరుచుకుంటాయి. దాంతో శరీరము, మనస్సూ కొత్త శక్తిని, కొత్త చైతన్యాన్ని పుంజుకుంటాయి. అందువల్ల పైన తెలిపిన పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వుండాలి.