1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nara Lokesh serious over Devansh Ghat orders immediate name change Devansh Ghat

గోదావరి పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరా? మంత్రి నారా లోకేశ్ ఫైర్

devansh ghat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది గోదావరి పుష్కరాలు జరుగనున్నాయి. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్ల బాధ్యతను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వీకరించారు. అయితే, ఈ పుష్కరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఓ ఘాట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పేరు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయంపై ఐటీ, మానవవనరుల శాఖామంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇది చాలా హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తూ, ఆ పేరును వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి తగవని ఆయన స్పష్టం చేశారు. 
 
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, మునికూడలిలో గోదావరి పుష్కరాల కోసం ఘాట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ ఘాట్‌కు దేవాన్ష్ ఘాట్‌‍ అని పేరు పెట్టారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఈ ఘాట్‌ను పరిశీలించి, దీనిని మోడల్ గ్రామీణ పుష్కర ఘాట్‌గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ ఘాట్‌ వద్ద దేవాన్ష్ పేరుతో ఉన్న బోర్డు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం కుటుంబ సభ్యుడి పేరు పెట్టడంపై నెటిజన్లు నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ వివాదం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. ఈ ఘాట్‌కు కూడా దేవాన్ష్ పేరు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం, పారదర్శక ముఖ్యమని చెప్పకనే చెప్పారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భూ వివాదం.. వేట కొడవళ్లతో మహిళపై దాడి..ఎక్కడ?