1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. What are the benefits of Arjuna Tree

అర్జున చెట్టుతో ఆరోగ్య ప్రయోజనాలు

benefits
అర్జున చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ చెట్టు హృదయ సంబంధ సమస్యలను అరికట్టడంలో దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదంలో తెలుపబడింది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, దగ్గును నివారించడం, అదనపు ఆమ్లత్వం హానికరమైన ప్రభావాల నుండి కడుపులోని గోడల్ని రక్షించడంలో అర్జున బెరడు సమర్థవంతంగా  పనిచేస్తుందని తెలుపబడింది.
 
ముఖ్యంగా ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అర్జున బెరడు కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గిస్తుంది. ఫలితంగా హృదయ సంబంధ వ్యాధులను నిరోధిస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీ-క్లాటింగ్ ఏజెంట్ కావడం వలన ఇది స్ట్రోక్, గుండెపోటుతో పాటు వయసు-ఆధారిత హృదయ సంబంధ సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది.
 
అర్జున చెట్టు బెరడు రక్తపోటును నియంత్రించడానికి ఇతర మూలికలతో కలిపి ఇస్తారు. ఇది శ్వాస అందకపోవడాన్ని మరియు సిస్టోలిక్ రక్తపోటును తగ్గిస్తుందని కూడా కనుగొనబడింది. ఈ చెట్టు నదీ పరీవాహక ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆయర్వేద వైద్యాలయాల్లో ఈ చెట్టు సంబంధ మూలికలు లభిస్తాయి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
వర్క్ ఫ్రమ్ హోం.. వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే..