1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
  4. Dry dates health benefits

గర్భిణీ మహిళలు ప్రసవానికి 4వారాల ముందు ఎండు ఖర్జూరాల్ని తింటే?

గర్భిణీలు మహిళలు ప్రసవానికి నాలుగు వారాల ముందు రోజుకు నాలుగు ఖర్జూరాలు తింటే ప్రసవం సులువుగా అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Dry dates health benefits
ఎడారి ఖర్జూరాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. ఏ పండైనా పండితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు తీసుకుంటారు.

అలాంటి ఖర్జూరాలను రోజుకు రెండేసి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
 
ఖర్జూరాల్లో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. రక్తస్రావాన్ని అరికట్టి శరీరానికి శక్తినిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. గర్భిణీలు మహిళలు ప్రసవానికి నాలుగు వారాల ముందు రోజుకు నాలుగు ఖర్జూరాలు తింటే ప్రసవం సులువుగా అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
తర్వాతి కథనం
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు