1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. 3 flight disruptions in a day: Passengers' protests, AC failure, emergency landing

స్పైస్‌జెట్ ప్రయాణీకుల కష్టాలు.. ఏసీ లేక గర్భిణీ మహిళలు నానా తంటాలు (video)

AC failure
AC failure
డొమెస్టిక్ విమానాలలో సాంకేతిక లోపాల కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులకు గురవుతున్నారు. కోల్‌కతా నుండి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు కోల్‌కతా విమానాశ్రయంలో నిరసన చేపట్టారు.
 
మరో ఘటనలో ఢిల్లీ నుండి పుణే వెళ్లాల్సిన స్పైస్‌జెట్ (ఎస్‌జీ105) విమానంలో ప్రయాణికులు నరకం చూశారు. విమానం ఎక్కిన తర్వాత ఎయిర్ కండిషనింగ్ సిబ్బంది పనిచేయకపోవడంతో లోపల గాలి ఆడక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు, గర్భిణీలు వేడికి విలవిలలాడగా, ప్రయాణికులు రన్‌వేపైకి వచ్చి నిరసన తెలిపారు. అనంతరం సాంకేతిక బృందం పరిశీలించి ఆ విమానం ఎగిరే పరిస్థితిలో లేదని ధృవీకరించడంతో ప్రయాణికులను విమానాశ్రయ టెర్మినల్‌కు తరలించి, ఉదయం 5 గంటలకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి స్పైస్‌జెట్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.
 
ఇదే సమయంలో కోల్‌కతా నుండి చెన్నైకి వస్తున్న ఇండిగో (6ఈ-723) విమానంలో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు ఎడమ వైపు ఇంజిన్ నిలిచిపోవడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి విధించారు. రాత్రి 11:29 గంటలకు ఎమర్జెన్సీ ప్రకటించగా, 224 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానం రాత్రి 11:37 గంటలకు చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకోగా, ఆ తర్వాత అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అలా ఏమీ లేదు.. మీరు కొంచెం మారిపోయారు : ప్రధాని మోడీతో ఖర్గే సరదా సంభాషణ