1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Big Warning! SBI Alert to 42 Crore Customers,

శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు ఎస్‌బిఐ బ్యాంకు సేవలకు అంతరాయం

SBI
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు సేవలు కొన్ని నిమిషాల పాటు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలకు 150 నిమిషాల పాటు అంతరాయం కలుగనుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న తమ 42 కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులను అలర్ట్ జారీ చేసింది. 
 
ఆన్‌‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేసుకోలేరని భారతీయ స్టేట్ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లు ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోవడం మంచిది. కొత్త ఫీచర్స్‌ను అప్‌డేట్ చేసేందుకు ఎస్‌బీఐ మెయింటెన్స్ కార్యకలాపాలు చేపట్టినందున.. ఈ సమయంలో కస్టమర్లు లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. 
తర్వాతి కథనం
శ్రీనగర్ దన్మార్ ఏరియాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం