మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (13:19 IST)

ఎస్బీఐ అకౌంట్ కలిగివున్నవారు.. ఆదివారం జాగ్రత్త.. ఎందుకంటే?

ఎస్బీఐ అకౌంట్ కలిగివున్నవారు.. ఆదివారం జాగ్రత్త. ఎందుకంటే కొన్ని గంటల పాటు ఈ సేవలకు అంతరాయం కలుగనుంది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి, ఆయా సేవలను అప్ గ్రేడ్ చేయాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది. దీంతో అంతరాయం కలుగనుందని వెల్లడించింది. బ్యాంకింగ్ సేవలకు 2021, జూలై 04వ తేదీ ఆదివారం అంతరాయం కలుగనుంది.
 
బ్యాంకుకు సంబంధించి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్యాంకు డిజిటల్‌ చెల్లింపుల వేదికలైన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో, యూపీఐ తదితర సేవలు ఆదివారం కొన్ని గంటల పాటు పరిమిత సయమంలో నిలిచిపోనున్నాయి. 
 
ఆదివారం మధ్యాహ్నం 03 గంటల 25 నిమిషాల నుంచి 05 గంటల 50 నిమిషాల వరకు డిజిటల్‌ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని బ్యాంకు తెలిపింది. ఈ విషయంలో ఖాతాదారులు సహకరించాలని సూచించింది. ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్ అని సూచించింది.