1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Encounter breaks out Srinagar Two Terrorists Killed

శ్రీనగర్ దన్మార్ ఏరియాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం

Srinagar
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని దన్మార్‌ ప్రాంతంలో ఉన్న ఆలమ్‌దార్‌ కాలనీలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. 
 
ఈ సందర్భంగా గాలింపు బృంధాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరణించినవారిని లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు ఎస్‌బిఐ బ్యాంకు సేవలకు అంతరాయం