మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (09:31 IST)

గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేసిన అమేజాన్ డెలివరీ బాయ్‌.. వీడియో వైరల్

horse
అమేజాన్ డెలివరీ బాయ్ గుర్రంపై వెళ్లి డెలివరీ చేయడానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ కామర్స్ అందుబాటులోకి వచ్చాక, వేలాది మంది నిరుద్యోగులకు ఉపాది దొరికింది. డెలివరి బాయ్‌గా ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎంత వేగంగా ఆర్డర్లు డెలివరీ చేయగలిగితే అంత పేరు వస్తుంది. డబ్బులు వస్తాయి. ఆర్డర్లు డెలివరీ చేయాలి అంటే టూవీలర్ తప్పనిసరి. 
 
కానీ, కాశ్మీర్ కు చెందిన ఒ డెలివరీ బాయ్ వినూత్నంగా ఆర్డర్లు డెలివరీ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. టూవీలర్‌, ఫోర్ వీలర్ కాకుండా, వస్తువులను డెలివరీ చేసేందుకు గుర్రంను వినియోగించాడు. గుర్రంపై వెళ్లి వినియోగదారులకు వస్తువులను అందజేస్తున్నాడు. 
 
ప్రస్తుతం కాశ్మీర్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. రోడ్డుపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోవడంతో గుర్రాన్ని వినియోగించి ఆర్డర్లు డెలివరీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు అమేజాన్ డెలివరీ బాయ్‌. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.