అమేజాన్ క్రిస్మస్ సేల్.. భారీ డిస్కౌంట్స్.. రూ .22,999కే గెలాక్సీ ఎం 51
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ మరో భారీ సేల్‌తో ముందుకొచ్చింది. రానున్న క్రిస్మస్ పండుగ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించడానికి 'అమెజాన్ క్రిస్మస్ సేల్'ను ప్రకటించింది. ఈ సేల్‌ను ఇప్పటికే అమేజాన్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రారంభించింది.
సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం డిస్కౌంట్, ల్యాప్‌టాప్‌లపై 30 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. క్రిస్మస్ సేల్లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలతో పాటు మరిన్ని ఉత్పత్తులపై అమేజాన్ డిస్కౌంట్లు అందిస్తోంది.
అమెజాన్ క్రిస్మల్ సేల్లో భాగంగా రూ.24,999 విలువ గల సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్‌ను రూ .22,999కే కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.10,650 వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. రూ .13,999 ధర గల షియోమి రెడ్‌మి నోట్ 9ప్రో పాత ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ 4GB RAM, 64GB స్టోరేజ్ స్పేస్తో వస్తుంది. ఎక్చేంజ్ ఆఫర్ కింద రూ.11,650 డిస్కౌంట్ లభిస్తుంది.