గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

అమేజాన్ చేతికి ఎఫ్-3.. ఇక సందడి మామూలుగా వుండదుగా..!

F3
'ఎఫ్ 2' మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రస్తుతం 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో 'ఎఫ్ 3' సినిమా తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా - మెహరీన్ హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌కి ఫైనాన్స్‌ని జత చేసి మోర్ ఫన్ క్రియేట్ చేస్తున్నారని తెలుస్తోంది. మూడింతల వినోదంతో రాబోతున్న 'ఎఫ్ 3' పై మంచి అంచనాలే ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో 'ఎఫ్3' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రికార్డ్ ధర పలుకుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఎఫ్ 3' స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందట. రేట్ ఎంతో వెల్లడించనప్పటికీ ఈ సినిమా అన్ని భాషల రైట్స్ రికార్డు స్థాయి ధరకే అమ్ముడు పోయాయని అంటున్నారు. 
 
కాగా ఇటీవలే తిరిగి ప్రారంభమైన 'ఎఫ్ 3' షూటింగ్ రెండో షెడ్యూల్ జరువుకుంటోంది. తాజా షెడ్యూల్ లో కరోనా నుంచి కోలుకున్న వరుణ్ తేజ్ కూడా పాల్గొంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వేసవిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బొమన్ ఇరానీ - సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.