బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (07:00 IST)

జమ్ము-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

Sri Nagar
జమ్ము-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడిలో సీఆర్పీఎఫ్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ మరణించారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్‌ శివార్లలో లావాపొర ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై మిలిటెంట్లు గురువారం కాల్పులు జరిపారు. ఎస్సై మంగా రాందేవ్‌ను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ అశోక్‌ కుమార్‌. 
 
మిలిటరీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయపడిన కానిస్టేబుళ్లు నజీం అలీ, జగన్నాథ్‌కు చికిత్స అందిస్తున్నారు. హత్యకు గురైన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని 54 ఏళ్ల సబ్ ఇన్‌స్పెక్టర్ మాంగా దేబ్ బార్మా, 36 ఏళ్ల కానిస్టేబుల్ అశోక్ కుమార్‌గా సిఆర్‌పిఎఫ్ గుర్తించింది. గాయపడిన సిఆర్‌పిఎఫ్ జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
 
 శ్రీనగర్ శివారులోని లావేపోరా వద్ద శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ఈ దాడి జరిగింది.