శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (16:25 IST)

హైదరాబాద్ అబిడ్స్.. SBI ఆవరణంలో కాల్పులు..

హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో కాల్పుల కలకలం రేగింది. అబిడ్స్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడే సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్న ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు కాల్పులకు దిగినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో ఓ ఉద్యోగికి గాయాలయ్యాయి. 
 
అయితే అక్కడే ఉన్న బ్యాంక్ సిబ్బంది గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సురేందర్ అనే వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డ సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాల్పుల్లో గాయపడిన వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టారు. అయితే రద్దీగా ఉండే అబిడ్స్ ప్రాంతంలో ఈ రకమైన ఘటన చోటు చేసుకోవడంతో అంతా ఉలిక్కిపడ్డారు.