సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (14:09 IST)

తెలంగాణ ఇంటర్ బోర్డ్ షాక్.. ఆగస్ట్‌లో పరీక్షలు పెట్టి మార్కులేస్తారట!

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రద్దు చేసే క్రమంలో అవకాశం వస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని గతంలోనే బోర్డు ప్రకటించింది. అందర్నీ ప్రమోట్ చేసినా, ఆగస్ట్‌లో పరీక్షలు పెట్టి మార్కులు కేటాయిస్తామని చెబుతోంది. సెప్టెంబర్ తర్వాత మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉండటంతో అంతకంటే ముందుగానే పరీక్షలు జరపాలనుకుంటున్నారు. 
 
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకోసం గతంలో 4,59,008మంది విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఇప్పుడు వీరందరికీ పరీక్షలు జరుపుతామంటోంది ఇంటర్ బోర్డ్. అయితే బోర్డ్ ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒప్పుకుంటేనే పరీక్షలు జరుగుతాయి. గతంలో పరీక్షలు లేవని చెప్ప సరికి చాలామంది విద్యార్థులు సెకండ్ ఇయర్ కోర్స్‌పై దృష్టిపెట్టారు. 
 
ఇత తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తుది అనుమతి రాగానే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తుందని అంటున్నారు అధికారులు.