శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (12:31 IST)

ఢిల్లీలో బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు

దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇక్కడి తెలంగాణ భవన్‌లో రెండు రోజుల పాటు లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 
 
టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌ మంగళవారం ఈ ఉత్సవాలకు హాజరై ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. లాల్‌ దర్వాజా సింహవాహిని దేవాలయం కమిటీ  ప్రతి ఏడాది ఢిల్లీలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. 
 
తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను సీఎం కేసీఆర్‌ అధికారిక పండుగగా గుర్తించారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్‌ అన్నారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు.