గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జులై 2021 (11:58 IST)

ఆన్‌లైన్ గేమ్ కోసం.. 12 ఏళ్ల బాలుడు తల్లి బంగారాన్ని అమ్మేశాడు..

ఆన్‌లైన్ గేమ్స్‌కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చివరికి పిల్లల చేతికి ఫోన్ రావడంతో ఎన్నో అనర్థాలు కూడా జరిగిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది చిన్నారులు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ చివరికి ఇక ఈ గేమ్‌లకి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలను జతచేసి భారీగా మోసపోయిన ఘటనలు ఎన్నో మీదికి వచ్చాయి. 
 
ఇక్కడ మాత్రం అంతకుమించి అనే ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా 12ఏళ్ల బాలుడు తన తల్లి బంగారాన్ని అమ్మేశాడు. మొబైల్ గేమ్ కోసం ఇలా చేశాడు 12 ఏళ్ల బాలుడు. ఇక ఆ తర్వాత ఇంట్లో ఏం అంటారో అన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు.
 
ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన 12 ఏళ్ల బాలుడు గత కొంత కాలంగా ఆన్‌లైన్‌లో ఒక వీడియో గేమ్ ఆడుతున్నాడు. అయితే ఈ గేమ్ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి ఇక ఆయుధాలు కొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ పిల్లాడు ఒక దారుణమైన ఆలోచన చేశాడు. 
 
ఏకంగా తల్లి బంగారం 20 వేలకు అమ్మేశాడు. ఆ తర్వాత ఆన్లైన్ గేమ్‌లో ఆయుధాలను కొన్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఇక ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలిస్తే మాత్రం ఏం జరుగుతుందో అని భయపడి పోయాడు. దీంతో ఇక ఇంట్లో నుంచి పారిపోయాడు. పోలీసులు గ్రహించి అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు.