బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (16:54 IST)

ఢిల్లీలో భారీ వర్షాలు: ఎయిమ్స్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా నీరు

Rains
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కడపడితే అక్కడ నీరు భారీగా నిలిచిపోయింది. నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకటంతో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కాగా ఈ సంత్సరం నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి ఆలస్యంగా తాకాయి. దీంతో వానకు కూడా ఆలస్యంగానే కురిసాయి. నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి ఆలస్యంగా చేరడం 15 ఏళ్లలో ఇదే మొదటిసారి అని వాతావరణ అధికారులు తెలిపారు.
 
అండర్ పాస్‌ల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టూవీలర్స్ నీటిలో వెళ్లలేక బైకులను తోసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. భారీగా కురిరసిన వర్షాలకు ఢిల్లీ ఎయిమ్స్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. 
 
ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఏరియాలో ఉదయం 7 నుంచి 8:30 గంటల మధ్యలో 2.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఢిల్లీకి సమీపంలోని ఎన్సీఆర్, గోహనా, సోనిపట్, రోహతక్, కేక్రా ఏరియాల్లో కూడా వర్షం కురిసింది.