మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (11:37 IST)

‘రాక్షసుడు 2’ రాబోతోంది

Rakshasudu 2 poster
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ర‌మేష్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం రమేష్‌ వర్మ మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు .
 
దర్శకుడు రమేష్‌ వర్మ తన నెక్ట్స్ మూవీని ప్ర‌క‌టించారు అలాగే దానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రాక్షసుడు 2’ టైటిల్‌ ఖరారు చేశారు.‘హోల్డ్‌ యువర్‌ బ్రీత్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ‘రాక్షసుడు’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటించనున్న ఓ స్టార్‌ హీరో పేరు త్వరలో వెల్లడించనున్నారు.
 
ఇక టైటిల్‌ పోస్టర్‌ విషయానికి వస్తే, .ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకుపోతున్నాడు. తన వెనకాల ఓ చైన్‌కు ర‌క్తంతో త‌డిసిన ప‌దునైన‌ కత్తి వేలాడుతుండ‌డం మ‌నం చూడొచ్చు. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్లోని అంశాలు సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని పెంచుతున్నాయి.
 
డిఫరెంట్‌ సెటప్‌లో మైండ్‌ బ్లోయింగ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది. టైటిల్, ట్యాగ్‌లైన్‌కు తగ్గట్లుగానే ‘రాక్షసుడు 2’ చిత్రం ‘రాక్షసుడు’ కంటే మరింత థ్రిల్లింగ్‌గా, హర్రర్‌గా ఉండనుంది.
రాక్షసుడు సినిమాకు పనిచేసిన సాంకేతికబృందమే `రాక్షసుడు 2` సినిమాకు కూడా పనిచేయనున్నారు. హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘ఏ స్టూడియోస్‌’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ సి దిలీప్‌ కెమెరామేన్‌.
 
శ్రీకాంత్ విస్సా, పాపులర్‌ సింగర్, రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తమ్ముడు సాగర్‌ ఈ సినిమాకు డైలాగ్స్‌ అందిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను రామ్‌ లక్ష్మణ్‌ పర్యవేక్షిస్తారు.