నేటి మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ మీటింగ్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ ఆదాయ మార్గాలతో పాటు వివిధ అంశాలు చర్చకు రానున్నాయి.
తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రాగా ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు మంగళవారం జరిగే కేబినెట్ కూడా ఆమోదం తెలుపనుంది. 32 శాఖల్లో 45 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది.
అటు పదోన్నతులపై కూడా నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ఇక ఆయా శాఖల వారీగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించిన ఆర్థికశాఖ ఇవాళ కేబినెట్ ముందు నివేదిక ఉంచనుంది. ముఖ్యంగా పోలీస్ శాఖలోనే 21 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనుండగా మిగిలిన పోస్టులను వివిధ శాఖల్లో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.