గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (11:04 IST)

నిరుద్యోగుల కోసం అండగా వైఎస్ షర్మిల దీక్ష

తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల నిలిచేందుకు ముందుకు వచ్చారు. నిరుద్యోగులకు న్యాయం జ‌రిగే వ‌ర‌కు, ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే వ‌ర‌కు తాను పోరాడ‌తాన‌ని ఇటీవల ప్రకటించారు. 
 
ఈ ప్రకటన మేరకు...  మంగళవారం దీక్ష ప్రారంభించారు. ఇటీవల వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామంలో కొండల్ అనే యువ‌కుడు ఉద్యోగం రావ‌ట్లేద‌ని మ‌న‌స్తాపం చెంది, ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే. కొండల్‌ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల వ‌న‌ప‌ర్తిలోనే ఈ ఉద్యోగదీక్ష చేపట్టారు. 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. 
 
అంతేకాకుండా, ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్షల్లో భాగంగానే ఆమె ఈ దీక్ష‌లో పాల్గొంటున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొన‌సాగుతుంది. ఈ దీక్ష‌లో నిరుద్యోగులు, విద్యార్థులు, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నేత‌లు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.