గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (17:38 IST)

షోకాజ్ నోటీస్ ఎఫెక్టు : కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ టిక్కెట్ తనకేనంటూ ఓ ప్రధాన అనుచరుడుతో యువ నేత కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న ఆడియో ఒకటి లీకైంది. ఇది కలకలం సృష్టించింది. దీంతో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీచేసింది. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ లేఖను ఆయన పార్టీకి పంపించారు. గత కొద్దికాలంగా అధికార పార్టీకి కౌశిక్ దగ్గరగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 
 
అంతేగాక తాజాగా విడుదలైన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ టికెట్ తనకు ఖాయమయ్యిందంటూ కౌశిక్ స్వయంగా తెలపడం తీవ్ర చర్చనీయాంశమైంది. 
 
ఆడియో టేపుల వ్యవహారంపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ టీపీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆలోపే తన రాజీనామాను కౌశిక్ రెడ్డి ప్రకటించారు.