గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (14:00 IST)

ముద్దు తెచ్చిన తంటా.. మంత్రి పదవి గోవిందా!

బ్రిటన్ ఆరోగ్య మంత్రి చిక్కుల్లో పడ్డారు. ఆయన ఓయువతికి పెట్టిన ముద్దు ఏకంగా ఆయన మంత్రిపదవికే ఎసరు పెట్టింది. ముద్దు తెచ్చిన తంటా కరోనా నిబంధన రూపంలో వెంటాడింది. చివరికి కేబినెట్‌ మంత్రి పదవిని కోల్పోవాల్సివచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బ్రిటన్ ఆరోగ్య మంత్రిగా మ్యాట్‌ హ్యాన్‌కాక్‌ రాజీనామా చేశారు. గత నెలలో తన కార్యాలయంలో ఓ మహిళను హ్యాన్‌కాక్‌ ముద్దాడుతున్న సీసీటీవీ ఫుటేజీ ఫొటోలను ఓ పత్రిక శుక్రవారం ప్రచురించింది. 
 
హ్యాన్‌కాక్‌కు ఆమె గతంలో స్నేహితురాలు. అయితే.. కుటుంబ సభ్యులు కానివారితో ఇండోర్‌(ఇల్లు, కార్యాలయం.. లోపల)లలో కూడా సన్నిహితంగా ఉండరాదనే నిబంధన ఈ సంఘటన జరిగినప్పటికి(మే 6నాటికి) అమలులోనే ఉంది. దీంతో.. కరోనా నిబంధనలను మంత్రి ఉల్లంఘించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా ఆయన తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.