1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. SBI OTP-based ATM cash withdrawal rules

నగదు విత్ డ్రా కోసం కొత్త విధానం అమల్లోకి తెచ్చిన ఎస్.బి.ఐ

sbi bank
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు ఏటీఎం కేంద్రాల్లో నగదు విత్‌డ్రాపై సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూ.10 వేలకు మించి ఎక్కువగా డబ్బులు డ్రా చేయాలంటే ఇకపై ఖచ్చితంగా వన్ టైమ్ పాస్‌వర్డ్ నంబరు (ఓటీపీ నంబరు)ను ఏటీఎం యంత్రంలో ఎంటర్ చేయాల్సి వుంటుంది. అపుడే రూ.10 వేలకు మించి నగదు విత్ డ్రా చేసేందుకు వీలుపడుతుంది. 
 
ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతోనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. ఖాతాదారుడి మొబైల్‌కు వచ్చే ఓటీపీని సరిగా నమోదు చేయకపోతే.. ఏటీఎం నుంచి నగదు బయటకు రాదని వెల్లడించింది. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు వీలవుతుంది.
 
తమ బ్యాంకు ఖాతాలో రూ.లక్షకు మించి నగదు నిల్వ ఉంటే, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఎన్ని సార్లయినా నగదును ఉపసంహరించే వీలుందని తాజా నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది. రూ.లక్ష కంటే తక్కువ మొత్తం ఉంటే మాత్రం 5 ఉచిత లావాదేవీలనే అనుమతిస్తారు. ఇతర బ్యాంకుల ఏటీఎంలో నుంచి 3 సార్లు మాత్రమే ఉచితంగా అనుమతిస్తారు. అంతకుమించితే ప్రతి లావాదేవీకి ఛార్జి పడుతుందని తెలిపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
చదివించరనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య