తిరుచ్చి నుంచి రాఘవ లారెన్స్ పోటీ.. జూన్ 11న ప్రకటిస్తానని హింట్
Raghava Lawrence
ఈ వార్తలను బలపరిచే దిశగా లారెన్స్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. తాను ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సమర్పణలో వస్తున్న హై-యాక్షన్ ఎంటర్‌టైనర్ బెంజ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు లారెన్స్ తెలిపారు. ఈ షెడ్యూల్ జూన్ 10తో ముగుస్తుందని స్పష్టం చేశారు.
ఈ షూటింగ్ పూర్తయిన మరుసటి రోజు, అంటే జూన్ 11 ఉదయం 9:30 గంటలకు మా అమ్మ ఆశీస్సులతో తన జీవితానికి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన, అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తానని అని లారెన్స్ వెల్లడించారు. ఈ ప్రకటన లారెన్స్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిందని టాక్ వస్తోంది.
