1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Trisha marriage news: Internet is officially breaking down

Trisha: త్రిషకు పెళ్లైందా... మెడలో ఆ మంగళసూత్రం ఏంటి... ఎవరు కట్టారు?

trisha
అవును ప్రస్తుతం సినీ నటి త్రిష పెళ్లి చేసుకుందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె మెడలో ఒక ప్రత్యేకమైన లాకెట్ ధరించి కనిపించింది.  సదరు లాకెట్ కేరళలోని సిరియన్ క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లయిన మహిళలు ధరించే మంగళసూత్రం మిన్నులా వుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చ మొదలైంది. 
 
ఈ ఫొటో చూసిన కొందరు నెటిజన్లు.. త్రిష కేరళకు చెందిన ఒక ప్రముఖుడిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ ఊహాగానాలు పుట్టించారు. అయితే ఈ ఫోటోకు పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని త్రిష సన్నిహితులు కొట్టిపారేశారు. 
 
త్రిష ప్రస్తుతం మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టి సరసన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాలో నటిస్తోంది. అలాగే మోహన్ లాల్ సరసన రామ్ వంటి క్రేజీ చిత్రాలలో నటిస్తోంది. ఈ సినిమాల్లోని కేరళ బ్యాక్‌డ్రాప్ పాత్ర కోసమే ఆమె ఆ సాంప్రదాయ ఆభరణాన్ని ధరించినట్లు తెలుస్తోంది. ఇది కేవలం షూటింగ్ లుక్ మాత్రమేనని టాక్ వస్తోంది.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
స్టార్స్ ఉంటేనే పెద్ద సినిమా కాదు.. : కమల్ హాసన్