1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
  4. Deep Tech Startup Ctruh Raises $2.5 Million Seed Round to Build the Infrastructure Layer of the Spatial Internet

స్పేషియల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం లక్ష్యంగా డీప్ టెక్ స్టార్టప్ కట్రూ 2.5 మిలియన్ డాలర్ల సీడ్ ఫండ్ సమీకరణ

image
స్పేషియల్ ఇంటర్నెట్ కోసం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేయర్‌ను నిర్మిస్తున్న బెంగళూరుకు చెందిన ప్రముఖ డీప్-టెక్ స్టార్టప్ కట్రూ.. తాజాగా $2.5 మిలియన్ల సీడ్ ఫండింగ్ రౌండ్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. తాజా నిధులతో కలిపి కంపెనీ ఇప్పటివరకు సమీకరించిన మొత్తం పెట్టుబడి $4.5 మిలియన్లకు చేరుకుంది. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ నేతృత్వంలో జరిగిన ఈ ఫండింగ్ రౌండ్‌లో అవ్యన్య వెంచర్స్ కో-లీడ్‌గా వ్యవహరించింది. ఇండియా యాక్సిలరేటర్, ఫౌండర్స్ ఎవెన్యూ, ఆంథిల్ వెంచర్స్, మరియు ఎల్వీఎక్స్ సంస్థలతో పాటు.. అన్‌అకాడెమీ మాజీ సీఓఓ, ఎమ్‌వర్సిటీ ఫౌండర్ & సీఈఓ వివేక్ సిన్హా, ఎక్సోటెల్ కో-ఫౌండర్ & సీఈఓ శివకుమార్ గణేశన్ వంటి ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు.
 
భారీ వ్యయం, సాంకేతిక సంక్లిష్టత కారణంగా ఇప్పటివరకూ ఇమ్మర్సివ్ 3D ఎక్స్‌పీరియన్స్ అనేది కేవలం భారీ హార్డ్‌వేర్, ప్రత్యేక నైపుణ్యాలున్న వారికే పరిమితమైంది. బ్రౌజర్-నేటివ్, నో-కోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందించడం ద్వారా కట్రూ ఈ అడ్డంకులను తొలగించి, 3D టెక్నాలజీని అత్యంత సులభంగా వ్యాపారాలకు అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్తగా సమీకరించిన నిధులను సంస్థ ప్రధానంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వేగవంతం చేయడానికి, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికల కోసం వినియోగించనుంది. భవిష్యత్ వృద్ధి వ్యూహంలో భాగంగా, 2026 నాటికి అమెరికా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో సేల్స్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి సంస్థ సిద్ధమవుతోంది.
 
వ్యాపార సంస్థలకు ఇమ్మర్సివ్ 3D, ఎక్స్‌ఆర్ ఎక్స్‌పీరియన్స్‌లను అందుబాటు ధరలో, సులభంగా అందించేలా తదుపరి తరం ఇంటర్నెట్ కోసం అవసరమైన ఫౌండేషనల్ టెక్నాలజీని కట్రూ నిర్మిస్తోంది. కంపెనీకి చెందిన ప్రత్యేకమైన బ్రౌజర్-నేటివ్ నో-కోడ్/లో-కోడ్ 3D ఇంజిన్ ద్వారా.. వినియోగదారులు ఎలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేయకుండానే, ప్రత్యేక హార్డ్‌వేర్ లేకుండానే అన్ని డివైజ్‌లలోనూ 3D ఫీచర్లను వెంటనే అనుభూతి చెందవచ్చు. దీనితో పాటు సంస్థ రూపొందించిన మరో కీలక టెక్నాలజీ వర్సాఏఐ. ఇది ఇమేజెస్, టెక్స్ట్ మరియు వీడియోలను కేవలం నిమిషాల్లో ప్రొడక్షన్-రెడీ 3D అసెట్స్‌గా మార్చే ఒక జనరేటివ్ ఏఐ ఇంజిన్. ఈ 3D ఇంజిన్ మరియు వర్సాఏఐ డీప్-టెక్ స్టాక్ సాయంతో ఇప్పటికే రిటైల్, ఈ-కామర్స్, డైరెక్ట్-టు-కన్స్యూమర్, ఆటోమోటివ్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన ఎన్నో సంస్థలు కట్రూ సేవలను వినియోగించుకుంటున్నాయి.
 
కట్రూ రూపొందించిన ప్రధాన కమర్షియల్ ప్లాట్‌ఫామ్ కామ్‌వర్స్ స్టూడియో.ఈ అత్యాధునిక సామర్థ్యాలన్నింటినీ ఒకే యూనిఫైడ్ ఎక్స్‌ఆర్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా అందిస్తుంది. ఈ నో-కోడ్, ఏఐ-ఆధారిత బ్రౌజర్-నేటివ్ ప్లాట్‌ఫామ్ ద్వారా.. కేవలం 30 నిమిషాల వ్యవధిలో బ్రాండ్‌లు తమ ఇమ్మర్సివ్ 3D/XR ఎక్స్‌పీరియన్స్‌లను క్రియేట్ చేసి డిప్లాయ్ చేయవచ్చు. కంటెంట్ క్రియేషన్, కామర్స్ ఫంక్షనాలిటీ మరియు అనలిటిక్స్‌ను ఒకే వర్క్‌ఫ్లోలో ఇది అనుసంధానం చేస్తుంది.
 
తాజా నిధులతో.. కట్రూ తన కోర్ టెక్నాలజీ స్టాక్‌పై, ముఖ్యంగా బ్రౌజర్-నేటివ్ 3D ఇంజిన్, వర్సాఏఐ, మరియు రియల్ ఎస్టేట్, ఆటోమోటివ్ రంగాల కోసం త్వరలో తీసుకురానున్న ప్రత్యేక వర్టికల్ ప్రొడక్ట్స్‌పై పెట్టుబడులను మరింత పెంచనుంది. అదే సమయంలో, ఎక్స్‌ఆర్ మరియు స్పేషియల్ కంప్యూటింగ్ వినియోగం వేగంగా పెరుగుతున్న అమెరికా, యూఏఈ మార్కెట్లలో తమ ఉనికిని బలోపేతం చేయడంపై సంస్థ దృష్టి సారిస్తుంది.
 
కట్రూ వృద్ధి ప్రణాళికలు, విజన్ గురించి సంస్థ ఫౌండర్ & సీఈఓ వినయ్ అగస్త్య మాట్లాడుతూ.. అధునాతన పరిష్కారాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వ్యాపార సంస్థలకు టెక్నాలజీని సరళతరం చేయడమే మా లక్ష్యం. రాబోయే తరం డిజిటల్ అనుభూతుల కోసం మేము ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మిస్తున్నాము. వ్యాపార సంస్థల పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి వ్యాపారానికీ 'స్పేషియల్ ఎక్స్‌పీరియన్స్' కల్పించడమే మా ధ్యేయం. తాజా పెట్టుబడులు ఈ లక్ష్య సాధనకు మరింత ఊతమిస్తాయి అని అన్నారు.
 
ఈ పెట్టుబడులపై ఐపీవీ సీఈఓ & కో-ఫౌండర్ వినయ్ బన్సాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏఐ రంగంలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ, కట్రూ తన బలమైన సాంకేతిక ప్రత్యేకతతో నిలబడుతోంది. వారు పేటెంట్ పొందిన 3D ఇంజిన్ ద్వారా.. హై-క్వాలిటీ 4K, 8K మరియు 16K ఎక్స్‌పీరియన్స్‌లను కూడా వెబ్‌లో వేగంగా, ఎలాంటి అంతరాయం లేకుండా రన్ చేయవచ్చు. ఏఐ టెక్నాలజీని 3D మరియు XR తో అనుసంధానించిన విధానం అద్భుతం. ఇవి కేవలం అత్యాధునికమైనవి మాత్రమే కాకుండా, రోజువారీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా విస్తృతంగా వినియోగించుకోవడానికి ఎంతో అనువుగా ఉంటాయి అని పేర్కొన్నారు.
 
అవ్యన్య వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ గౌరవ్ సింఘ్వి మాట్లాడుతూ.. అప్లికేషన్లు విస్తరించడానికి ముందే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించాల్సిన అవసరం ఉన్న ఒక కొత్త టెక్నాలజీ ఎప్పుడో ఒకసారి మాత్రమే పుట్టుకొస్తుంది. నేడు 3D టెక్నాలజీ కూడా అలాంటిదే. చాలా కంపెనీలు నిర్మించడానికి వెనుకాడే అత్యంత కష్టమైన ఫౌండేషన్ లేయర్‌ను కట్రూ గత మూడేళ్లుగా నిర్మిస్తుండటం మమ్మల్ని ఆకర్షించింది. బ్రౌజర్-నేటివ్ 3D ఇంజిన్, ప్రొడక్షన్-రెడీ అసెట్స్‌ను రూపొందించే జనరేటివ్ ఏఐ పైప్‌లైన్ కలిస్తే అదొక అద్భుతమైన టెక్నాలజీ అవుతుంది. కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా ప్రతి వ్యాపార సంస్థకు స్పేషియల్ ఇంటర్నెట్ వినియోగాన్ని సాధ్యం చేసేలా మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్న వినయ్ బృందానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము అని అన్నారు.
 
3D మరియు ఎక్స్‌ఆర్ టెక్నాలజీ డిప్లాయ్‌మెంట్‌లో ఉన్న అధిక వ్యయం, సంక్లిష్టత మరియు నైపుణ్యాల కొరతను గణనీయంగా తగ్గించడం ద్వారా, బ్రాండ్‌లు మరియు సంస్థలు కేవలం ప్రయోగాల దశకే పరిమితం కాకుండా తమ ప్రాజెక్టులను వేగంగా అమలు చేసేలా కట్రూ తోడ్పడుతోంది. ఐఐఎం బెంగళూరు ఎన్‌ఎస్‌ఆర్‌సిఈఎల్, లీప్‌ఎఫ్‌డబ్ల్యూడీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ వంటి ఎకోసిస్టమ్ భాగస్వాముల మద్దతుతో ముందుకు సాగుతున్న కట్రూ.. కర్ణాటక ప్రభుత్వం నుండి ఎలివేట్ 2025 అవార్డు, అలాగే ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్నోవేషన్‌కు గానూ ఏజిస్ గ్రాహం బెల్ అవార్డు 2025 వంటి కీలక గుర్తింపులను అందుకుంది.
About Writer
ఐవీఆర్