భారతదేశపు అత్యున్నత అధికారం కలిగిన క్లౌడ్, డేటా సెంటర్ ప్రొవైడర్ అయిన ఈఎస్డిఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్, సంస్థలు AI పనిభారాలను వినియోగించు, నిర్వహించు, పర్యవేక్షించు, సానుకూలం చేయు మరియు పరిపాలించుటలో సహాయం చేయుటకు రూపొందించబడిన ఒక సమీకృత AI ఆపరేషన్స్ వేదిక, ఎన్లైట్ AIOpsతో తన సమర్పణను బలోపేతం చేసుకుంది. సంస్థలు AI ప్రాజెక్ట్స్‌ను సురక్షితంగా, తక్కువ ఖర్చుతో స్కేల్ చేస్తూ, AI అమలులో ఉన్న ఆచరణాత్మక సంక్లిష్టతను సులభతరం చేయడం ఈ వేదిక ఉద్దేశం.
వ్యాపార పరివర్తన కొరకు సంస్థలు AI ను ఆవిష్కరిస్తుండగా, చాలా సంస్థలు సాధారణ ఆచరణాత్మక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. AI మోడల్స్ పైలట్ ప్రాజెక్ట్స్‌లో సంభావ్యతను ప్రదర్శిస్తుండగా, ఉత్పత్తి వాతావరణాలలోకి వాటిని మార్చడానికి తరచూ అనేక అడ్డంకులు ఉంటాయి, ఉదాహరణకు- విభజించబడిన సాధనాలు, అధిక జిపియూ ఖర్చులు, సుదీర్ఘమైన ఆన్‌బోర్డింగ్ ఆవృతాలు, వర్తింపు ప్రమాదాలు మరియు పాలనా అంతరాలు. ఉత్పత్తి ద్వారా మోడల్ అభివృద్ధి నుండి AI జీవక్రమాన్ని ఏకీకృతం చేసే సమీకృత వేదికను అందించడం ద్వారా, సంస్థలు కనీస అదనపు నిర్వహణ ఖర్చులతో AI ని ఆచరణలోకి తెచ్చే ఎన్లైట్ AIOps ఈ సవాళ్ళను పరిష్కరిస్తుంది.
పీయూష్ సోమాని, ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్, ఈఎస్డిఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్ ఇలా అన్నారు, కృత్రిమ మేథస్సు ఇంకా ఒక సాంకేతిక సంభాషణ కాదు, అది ఒక వ్యాపార పరివర్తన ఆవశ్యకము. రాబోయే సంవత్సరాలలో భారతదేశపు AI మార్కెట్ సుమారు 35-40% సిఏజిఆర్‌తో అభివృద్ధి చెందుతుందని ఆశించబడుతోంది. AIను అమలు చేయాలా, వద్దా అని కాకుండా AI ను కొలవదగిన వ్యాపార ఫలితాలు, వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ ఖర్చులు, అధిక ఆదాయము మరియు ధృఢమైన పోటీతత్వముగా ఎలా మార్చాలి అనేది ఈనాడు సంస్థలు ఎదుర్కొంటున్న సవాలు.
ఈఎస్డిఎస్లో మా నమ్మకం ఎప్పుడు స్పష్టంగా ఉంది, AI కేవలం ఒక సాంకేతిక ప్రయోగముగా మాత్రమే కాకుండా వ్యాపారముపై ప్రభావం చూపాలి. ఈ ఆలోచన మమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. మేము కేవలం మౌలిక సదుపాయలను లేదా గణనను అందించము, మేము మా సంస్థ వినియోగదారుల కొరకు AI పై పూర్తి యాజమాన్యాన్ని తీసుకుంటాము. నిర్దిష్ట వ్యాపార కొలమానాల కొరకు సరైన AI వ్యూహాన్ని నిర్వచించడము నుండి AI పనిభారాలను నిర్మించడము, నియోగించడము, పాలించడము మరియు నిరంతరం ఆప్టిమైజ్ చేయడము వరకు, మేము దానిని పూర్తి నిర్వహణతో, ఫలితం-ఆధారిత భాగస్వామ్యముగా అందించడం మా లక్ష్యము.
ఎన్లైట్ AIOps ఈ భావజాలము యొక్క స్వరూపముగా ఉండేందుకు పాటుపడుతుంది. ఇది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, ఇది సంస్థలు తమ మొత్తం వాల్యూ చెయిన్ వెంబడి, అంతర్నిర్మిత సమ్మతి, పరిపాలన మరియు సార్వభౌమ సమాచార నియంత్రణలతో, AI ను ఆచరణాత్మకంగా అమలులోకి తీసుకొని రాగలిగే ఒక సమీకృత ఆదేశ కేంద్రము.
మేము భారీ స్థాయిలో సార్వభౌమ AI మౌలికసదుపాయాల నుండి సేవ మరియు పరిష్కారాల వరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాము కాబట్టి ఈఎస్డిఎస్ అందరికంటే ప్రత్యేకంగా నిలిచింది. సంస్థలు గణనాలు, వేదికలు, సమ్మతి మరియు నైపుణ్యాల కొరకు అనేకమంది విక్రేతలను ఒకచోటికి కలపవలసిన పనిలేదు. ఈ ప్రారంభము భారతీయ సంస్థలు AI ను ఒక సాంకేతిక ప్రాజెక్ట్ మాదిరిగా కాకుండా, వ్యాపార పరివర్తనకు ఒక సాధనముగా ఎలా అమలు చేసుకోవచ్చు అనేదానికి ఒక నిర్ణయాత్మక చర్యను సూచిస్తుంది.
AI కార్యాచరణలలో కీలక సవాళ్ళు
AI ను అమలు చేయాలని అనుకునే సంస్థలు చాలా ఆచరణాత్మక సవాళ్ళను ఎదుర్కోంటారు:
విభజించబడిన సాధనాలు మరియు ప్రక్రియలు: AI బృందాలు సాధారణంగా GPU మౌలికస్దుపాయాల నిర్వహణ, MLOps వర్క్ ఫ్లోస్, పర్యవేక్షణ, పరిపాలన మరియు ఖర్చుల నివేదికల కొరకు వేరువేరు సాధనాలపై ఆధారపడతాయి. ఈ విభజన ప్రాజెక్ట్ గడువు సమయాలను నెమ్మదిస్తుంది మరియు ఆచరణాత్మక ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక GPU మరియు క్లౌడ్ ఖర్చులు: GPUలు, ముఖ్యంగా అధిక-పనితీరు ఉన్న నమూనాలు, ఖరీదైనవి, మరియు వీటిని సరిగ్గా వినియోగించకపోతే లేదా నిరుపయోగంగా ఉంటే, అది కాస్ట్-లీకేజ్ కు దారితీయవచ్చు.
పైలట్-టు-ప్రొడక్షన్ అంతరము: చాలా AI కార్యక్రమాలు ప్రయోగాత్మక వాతావరణాలలో విజయవంతం అవుతాయి కాని ఉత్పత్తి పనిభారాల కొరకు వినియోగించబడినప్పుడు ఆలస్యాలు లేదా వైఫల్యాలను ఎదుర్కొంటాయి.
పాటింపు మరియు పరిపాలన సంక్లిష్టత: సంస్థలకు, ముఖ్యంగా నియంత్రిత రంగాలకు, ఆడిట్-సిద్ధంగా ఉండే లాగ్స్, పాత్ర-ఆధారిత యాక్సెస్ నియంత్రణలు, ఆమోదాలు మరియు ఖచ్ఛితమైన డేటా రెసిడెన్సీ నిబద్ధతలు అవసరం ఉంటాయి.
ఆచరణాత్మక నిర్వహణ వ్యయము: GPU క్లస్టర్స్ నిర్వహణ, శిక్షణ మరియు ఇన్ఫరెన్స్ వర్క్ లోడ్స్ ఆర్కెస్ట్రేషన్ మరియు పనితీరు కొలమానాలను పర్యవేక్షించడము వంటి వాటిని అనేక డాష్ బోర్డులు మరియు ముఖ్యమైన మాన్యువల్ ప్రమేయము అవసరం ఉంటాయి.
ఈ సవాళ్ళు AI ఖర్చును పెంచుతాయి, సమయం ఎక్కువ తీసుకుంటాయి మరియు ఆచరణాత్మక రిస్క్ ను సృష్టిస్తాయి, దీని వలన సంస్థలు AI వినియోగించడానికి సంకోచిస్తారు లేదా పరిమితం చేస్తాయి.
ఎన్లైట్ AIOps: ఒక సమీకృత విధానము
ఎన్లైట్ AIOps, GPU మౌలికసదుపాయాల నిర్వహణ, MLOps వర్క్ ఫ్లోస్, పర్యవేక్షణ, పరిపాలన, వ్యయ నిర్వహణలను ఏకీకృతం చేసే ఒక సింగిల్ కంట్రోల్ ప్లేన్. ఈ వేదిక ఆన్-ప్రెమిసిస్, హైబ్రిడ్ మరియు బహుళ-క్లౌడ్ విస్తరణలకు సహకరిస్తుంది, తద్వారా సంస్థ AI పనిభారాలను తమ సొంత డేటా సెంటర్స్ లేదా ఈఎస్డిఎస్ యొక్క సార్వభౌమ క్లౌడ్ మౌలికసదుపాయాల నుండి నిర్వహించుకునే అనుకూలతను ఇస్తుంది.
ఈ వేదిక ద్వారా సంస్థలు ఈ పనులు చేసుకోవచ్చు:
GPU క్లస్టర్స్ ను సజావుగా ఆన్‌బోర్డ్ చేయడం: ప్రస్తుతం ఉన్న కుబెర్నెటెస్ GPU క్లస్టర్స్ ను దిగుమతి చేసుకోవడం మరియు తక్షణ వినియోగం కోసం సామర్థ్యాన్ని ఆవిష్కరించడం.
AI పనిభారాలను సమర్థవంతంగా నియోగించడం: శిక్షణ ఉద్యోగాల నియోగము, ఇన్ఫరెన్స్ సేవలు మరియు నోట్‌బుక్స్/డెవలప్మెంట్ వాతావరణాలను ముందుగా-కాన్ఫిగూర్ చేయబడిన టెంప్లేట్స్ మానవ ప్రమేయం లేకుండా అనుమతిస్తాయి.
పనితీరు మరియు వినియోగాన్ని పర్యవేక్షించడం: GPU ఆరోగ్యము, పని భారము పనితీరు, కేటాయింపు, మెమొరీ వినియోగము, విద్యుత్ వినియోగము మరియు ఉద్యోగ-స్థాయి టెలీమెట్రిలను వాస్తవ-సమయ డాష్ బోర్డ్స్ అందిస్తాయి.
కార్యకలాపాల పాలించడం మరియు సురక్షితం చేయడం: మల్టీ-టెనెంట్ ఆర్కిటెక్చర్, రోల్-బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ (ఆర్బిఏసి), ఆమోదాలు మరియు ఆడిట్ లాగ్స్ అన్నీ నియంత్రణ మరియు అంతర్గత పాలన ఆవశ్యకతలకు సమ్మతిని నిర్ధారిస్తాయి.
GPU వినియోగము మరియు ఖర్చులను ట్రాక్ చేయడము: షోబ్యాక్ మరియు చార్జ్‌బ్యాక్ వీక్షణ ద్వారా సంస్థలు ప్రాజెక్ట్, జట్టు లేదా పనిభారము వారిగా GPU-గంటలను పర్యవేక్షించేందుకు సహాయపడుతుంది మరియు ఊహించదగిన ఖర్చులను నిర్ధారిస్తుంది.
ఈ వేదిక మల్టీ-టెనెంట్ GPU ఆర్కెస్ట్రేషన్, ఆటోమేట్ చేయబడిన ప్రొవిజనింగ్ మరియు NVIDIA HGX H100/H200/B200/B300 GPUలలో వాస్తవ-సమయ పర్యవేక్షణలకు సహకరిస్తుంది మరియు 8,000 GPUలకు మించి ఉన్న సమూహాలకు ఒక సింగిల్ క్లస్టర్ నుండి స్కేలబిలిటిని నిర్ధారిస్తుంది.
సార్వభౌమ మరియు నిబంధనలను అనుసరించే AI కార్యకలాపాలు
సార్వభౌమత్వం, విస్తరణ సామర్థ్యం మరియు భద్రతల సూత్రాలను ఎన్లైట్ AIOps లోకి పొందుపరచడం ఈఎస్డిఎస్ లక్ష్యము. ఈ వేదిక డేటా రెసిడెన్సీ ఆవశ్యకతలు మరియు ISO 27001, SOC 2, DPDPA వంటి సమ్మతి ప్రమాణాలను మరియు ఇతర ప్రభుత్వ శాసనాలను పూర్తి చేస్తూ టైర్ III సర్టిఫైడ్ డేటా సెంటర్స్ మరియు ప్రభుత్వ కమ్యూనిటి క్లౌడ్ లో నిర్వహించబడుతుంది.
మా సార్వభౌమ క్లౌడ్ విధానము ముఖ్యమైన డేటా భారతదేశం దాటి వెల్లడించబడదని నిర్ధారిస్తుంది,” అని అన్నారు “సంస్థలు AI తో సమ్మతి, భద్రత మరియు కార్యకలాపాల నియంత్రణ అంతర్నిమితమై ఉన్నాయని తెలుసుకొని, నూతన ఆవిష్కరణలను నమ్మకంగా చేయవచ్చు.
కోమల్ సొమాని, హోల్-టైమ్ డైరెక్టర్, సిఎంఓ మరియు సిహెచ్ఆర్ఓ ఈఎస్డిఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్, ఇలా అన్నారు: పరిశ్రమలోని సంస్థలతో మా భాగస్వామ్యము ఒక సుస్థిరమైన వైఖరిని వెల్లడించింది, AI ఆశయం ఉన్నతంగా ఉంటుంది కాని ఆచరణాత్మక సంఘర్షణ వాస్తవ ప్రభావాన్ని నెమ్మదిస్తుంది. జట్లు మోడల్స్ లో పెట్టుబడి పెడుతున్నాయి, అయినా విభజించబడిన మౌలికసదుపాయాలు, GPU ఖర్చులు, పాలన ఒత్తిడులు మరియు ఆలస్యమవుతున్న ఉత్పత్తి విడుదలలతో ఇంకా కష్టపడుతున్నారు.
ఎన్లైట్ AIOps ఈ అంతరానికి మా సమాధానము. ఇది AI కార్యకలాపాలకు సమీకృత వేదిక విధానము ద్వారా నిర్మాణం, సరళత మరియు జవాబుదారీతనం తీసుకొస్తుంది. ఆర్కెస్ట్రేషన్, పర్యవేక్షణ, పాలన మరియు ఖర్చుల వీక్షణలను ఒకే కంట్రోల్ ప్లేన్ లోకి ఏకీకృతం చేయడం ద్వారా మేము సంస్థలు ప్రయోగాల నుండి స్థిరమైన AI-ఆధారిత ఫలితాల వైపుకు అడుగువేసేందుకు సహకరిస్తున్నాము.
ఆవిష్కరణ అంటే సంక్లిష్టత చేర్చడం కాదు, దానిని తొలగించడం అని మేము విశ్వసిస్తాము. AI మరింత అందుబాటులో ఉండేదిగా, కొలవదగినదిగా మరియు సంస్థలకు-సంసిద్ధతను అందించే పరిష్కారాలను రూపొందించడమనే మా నిబద్ధతను ఎన్లైట్ AIOps ప్రతిబింబిస్తుంది.
పైలట్ మరియు ముందస్తు యాక్సెస్ ప్రోగ్రాం
వర్తింపును సానుకూలపరచుటకు, ఈఎస్డిఎస్ ఒక 14-రోజుల పైలట్ కార్యక్రమాన్ని అందిస్తోంది. సంస్థలు AI పనిభారాలను అనువర్తించడం, శిక్షణ మరియు అంచనా పనిభారాలను నియోగించడం, డాష్ బోర్డ్స్ మరియు హెచ్చరికలను సక్రియం చేయడం మరియు వినియోగము మరియు సామర్థ్యాన్ని కొలుచుటకు GPU-గంట షోబ్యాక్ నివేదికలను ఉత్పన్నం చేయడం చేయవచ్చు
ఈ పైలట్ కార్యక్రమము ఒక పూర్తి-స్థాయి విస్తరణకు ముందు సంస్థలకు స్పష్టమైన విజయ ప్రమాణాలను అందించడం, సమీకృత AI కార్యకలాపాల ప్రయోజనాలను ప్రదర్శించడం లక్ష్యంగా కలిగి ఉంది.
ఆలోచన నాయకత్వము మరియు భవిష్యత్ రోడ్ మ్యాప్
ఎన్లైట్ AIOps అనేది ఈఎస్డిఎస్ యొక్క విస్తృత ఏకీకృత AI ప్లాట్‌ఫార్మ్. ఇది MLOps, GPU సమకూర్చడం, పర్యవేక్షణ మరియు పాలనల సహా మొత్తం AI జీవచక్రానికి సింగిల్ కంట్రోల్ ప్లేన్ ను అందిస్తుంది.
ఎన్లైట్ AIOps కొరకు ప్రణాళిక చేయబడిన భవిష్యత్ మెరుగుదలలు:
GPU ప్లేస్మెంట్ మరియు రిసోర్స్ వినియోగము కొరకు ఆప్టిమైజేషన్ ఇంజన్స్
డౌన్ టైం తగ్గించటానికి ప్రిడిక్టివ్ ఫెయిల్యూర్ అలర్ట్స్
సమ్మతి & పాలనా ఆటోమేషన్
కొలవదగిన హైబ్రిడ్ AI విస్తరణలను సక్రియం చేయుటకు మల్టి-రీజన్ ఫెడరేషన్