బెంగళూరు-విజయవాడ విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్‌లో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి
Bengaluru-Vijayawada Flight
విమానం గాలిలోకి లేచిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో, అది తిరిగి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది. విమానం తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై అనిశ్చితి నెలకొనడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చింది.
సాంకేతిక సమస్య, విమాన స్థితిగతుల గురించి విమానయాన సంస్థ సిబ్బంది సకాలంలో స్పష్టమైన సమాచారం అందించకపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.
