1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Today Gold and Silver Price

మంగళవారం మళ్లీ పెరిగిన బంగారం ధర

Gold
దేశంలో బంగారు ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు తగ్గడం, మరోరోజు పెరగడం జరుగుతున్నాయి. సోమవారం తగ్గిన బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. 
 
అయితే తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో చూసుకుంటే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,000కి చేరింది.
 
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 పెరిగి రూ.49,090 కి చేరింది. బంగారం ధరలు పెరగగా మరో వైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ.300 తగ్గి 72,900కి చేరింది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రోజూ పెరుగుతున్న చికెన్ ధరలు... కేజీ రూ.270