సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జులై 2021 (10:21 IST)

దేశంలో స్థిరంగా ఉన్న పసిడి - వెండి ధరలు...

మన దేశంలో బంగారంతో పాటు.. వెండికి చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై మహిళలకు అధిక వ్యామోహం ఉండటంతో వేలకు వేలు ఖర్చు చేసి ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం ఈ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో ధ‌ర‌లు ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44,750వద్ద ఉంది.
 
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,820 వ‌ద్ద ఉంది. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.700 పెరిగి 74,100 వద్ద ఉంది.