తగ్గిన పసిడి ధర : కిలో వెండిపై రూ. 559 డౌన్
దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం ధర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 451 తగ్గి రూ.46,844కు దిగొచ్చింది. వెండి కూడా కిలోకు రూ.559 తగ్గి రూ.67,465కు చేరుకుంది.
అదేసమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1805 డాలర్లుగా ఉండగా, వెండి ధర 25.93 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,200గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310 ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820 ఉంది.