గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 జులై 2021 (18:17 IST)

మరోసారి పెరిగిన బంగారం ధర - రూ.250 పెరుగుదల

దేశంలో పెట్రోల్, డీజిల్‌తో పాటు.. బంగారం, వెండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే నాథుడే కనిపించడం లేదు. శుక్రవారం కూడా బంగారం ధర పెరిగింది. 
 
తాజాగా ఈరోజు కూడా బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ.45,150కి చేరింది.
 
అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ.49,260కి చేరింది. ఇక బంగారంతో పాటుగా వెండి ధ‌ర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.600 పెరిగి రూ.74,500కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది.