గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (13:06 IST)

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు తాజా మరోసారి పెరిగాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి రూ.44,900కి చేరింది.
 
అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.110 పెరిగి 48,990 కి చేరింది. అయితే బంగారం ధరలు పెరుగుతుండగా…మరోవైపు వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 5,200 పెరిగి రూ.69,200 కి చేరింది.