మొన్నటి దాకా నేలచూపులు చూసిన పసిడి పరుగులు తీస్తోంది
భారతదేశంలో బంగారు ధరలు మంగళవారం పెరిగాయి. జూలై 6న 10 గ్రాముల బంగారం 0.34 శాతం పెరిగి రూ. 47,459కు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ధరలు దాదాపు మూడు వారాల్లో కొత్త గరిష్టాన్ని తాకింది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.4% పెరిగి 1,159 డాలర్లుగా ఉంది.
కాగా మొన్నటివరకూ కరోనా ఆంక్షలు కారణంగా బంగారం ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కానీ మరోసారి పుత్తడి పుంజుకుని సాగుతోంది. వెండి ధరల్లోనూ తేడాలు కన్పించాయి.