శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (15:08 IST)

తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. కారణమేంటి?

నిన్నామొన్నటివరకు ఆకాశానికి అంటిన బంగారు ధరలు ఇపుడు కిందికి దిగివస్తున్నాయి. అంతర్జాతీయంగా పసిడి ధరల్లో మార్పులు, దేశీయంగా డిమాండ్ వంటి వివిధ కారణాలతో గత సోమవారం నుంచి శనివారం వరకు పసిడి మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. 
 
అయితే, ఆదివారం ట్రేడింగ్ ఉండనందున అంతకుముందు సెషన్‌కు కొద్ది మార్పులతో పసిడి విక్రయాలు జరుగుతాయి. పసిడి ధరలు గత మూడు వారాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. మధ్యలో స్వల్పంగా పెరిగినప్పటికీ మొత్తానికి గరిష్ట ధరల నుండి వేలల్లో తగ్గుదల నమోదుచేసింది. గత వారంలో ఆగస్టు 24వ తేదీ నుండి ఆగస్టు 29వ తేదీ వరకు పసిడి ధరలు ఒక్కరోజు మినహా ప్రతిరోజు ఎంతోకొంత తగ్గాయి.
 
అయితే స్వల్ప తగ్గుదలతో ముగిశాయి. మొదటి మూడు రోజుల్లో దాదాపు రూ.1500 తగ్గింది. మరుసటి రోజు రూ.600కు పైగా పెరిగింది. తర్వాత వరుసగా రెండు రోజులు తగ్గింది. వారం మొత్తంలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర సోమవారం దాదాపు రూ.50,500 వద్ద ప్రారంభమైంది. 
 
శనివారం నాటికి రూ.దాదాపు రూ.1500 తగ్గి రూ.49,100కు ఎగువన ముగిసింది. 24 క్యారెట్ల పసిడి పసిడి సోమవారం రూ.55 వేల కంటే పైన పలికింది. శనివారం నాటికి రూ.1500 వరకు తగ్గి దాదాపు రూ.53,600 వద్ద ముగిసింది.
 
అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు, కరోనా మహమ్మారి కేసులు, వ్యాక్సీన్, ట్రేడ్ వార్, భౌగోళిక పరిస్థితుల ప్రభావం పసిడిపై ఉంటుంది. వ్యాక్సీన్‌పై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోవడం, రష్యా వ్యాక్సీన్ ఇప్పటికే రావడంతో ఇన్వెస్టర్లు గందరగోళంలో ఉన్నారు. బంగారం అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నది. రష్యా వ్యాక్సీన్ వచ్చిన ఆగస్ట్ 12వ తేదీ మరుసటి రోజు నుంచి అమ్మకాల ఒత్తిడి పెరిగింది.